అలీ నిర్మాతగా మారనున్నాడట…

కమెడియన్ అలీ. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎప్పుడో యుక్త వయసులో ఇండస్ర్టీలోకి వచ్చి.. తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నాడు. సినిమాలనే కాకుండా బుల్లి తెరపై కూడా అలీ సందడి మామూలుగా ఉండదు. ఈటీవీలో ప్రసారమయ్యే ‘అలీ తో సరదాగా’ ప్రోగ్రాంకు ఉన్న క్రేజ్ ను చూస్తే తెలిసిపోతుంది. బుల్లి తెరపై అలీ హంగామా ఎంతలా ఉంటుందో. సీరియల్స్ లో కూడా అలీ మెరుస్తున్నారు. నటుడిగా అలీ ఇప్పటి వరకు దాదాపు 900 పై చిలుకు చిత్రాల్లో నటించారు.

ప్రస్తుతం నటుడు అలీ ఓ సినిమాను నిర్మించే పనిలో ఉన్నారట. తన పేర టాలీవుడ్ లో అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్ అనే సంస్థ ను కూడా ప్రారంభించాడు. కాగా అలీ నిర్మించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ తో కలిసి అలీ స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం అలీ పెద్ద స్కెచ్ వేశాడు. రేపు సాయంత్రం ఈ సినిమాలోని మొదటి లిరికల్ పాటను పాన్ ఇండియా స్టార్ బాహుబలి ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేయించేందుకు ఏర్పాట్లు చేశాడు. మరి చూద్దాం.. అలీ నూతన జర్నీ ఎలా సాగుతుందో…