బాలయ్య సినిమాలో అల్లరి నరేష్… నిజమేనా?

నందమూరి బాలకృష్ణ వరస ప్లాపుల నుండి బయటపడడానికి ఇప్పుడు బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరిదీ హిట్ కాంబినేషన్. సింహా, లెజండ్ ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో మనందరికీ తెలుసు. వీరు మూడోసారి హ్యాట్రిక్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందే ఈ సినిమా షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది కూడా. ఆ షెడ్యూల్ లో షూట్ చేసిన ఫుటేజ్ నుండే బాలయ్య పుట్టినరోజుకు స్పెషల్ సర్ప్రైజ్ ను విడుదల చేసారు కూడా. అది ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది.

ఇక తాజా సమాచారం ప్రకారం వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరిగి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయ్. అయితే ముందు నుండీ ఈ సినిమాలో చేయాల్సిన ఒక యువ హీరో పాత్ర గురించి రకరకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి. నవీన్ చంద్ర, బెల్లంకొండ శ్రీనివాస్ తదితరుల పేర్లు వినిపించినా అవేమి నిజాలు కావని తేలిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అల్లరి నరేష్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. బోయపాటి శ్రీను ఇటీవలే నరేష్ ను కలిసి తన పాత్రను వివరించాడట. ఇంకా తన దగ్గర నుండి రెస్పాన్స్ రావాల్సి ఉంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో టీమ్ కే తెలియాలి.