వలస కార్మికుల కోసం అల్లు అరవింద్ సైతం

ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ పరిస్థితుల్లోనే ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితులకు వ్యవస్థలే నిస్తేజమైపోవడంతో ఎక్కువగా బలైపోయింది అసంఘటిత కార్మికులే. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఉపాధి కరువై పోయింది. దీంతో ఉన్నదేదో చేతబట్టి భార్యా, బిడ్డలతో సొంతూళ్లకు పయనమయ్యారు. వీరి వ్యధలు పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాల్లో బాగా ఫోకస్ అయ్యాయి. దీంతో ఎంతోమంది స్పందించి వారికి అన్నదానాలు చేశారు. ప్రభుత్వాలు స్పందించాయి. ఇందుకు కెట్టో అనే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ కూడా ముందుకు వచ్చింది. విరాళాలు సేకరించి వారిని ఆదుకుంటోంది.

వీరిని ఆదుకునేందుకు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కూడా ముందుకొచ్చారు. తన వంతు సాయంగా 2లక్షల 50వేలు సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని కెట్టో సంస్థకు అందించారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అల్లు శిరీష్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. మరెంతోమంది దాతలు విరాళాలు అందిస్తున్నారు. ఇందుకు చలించిన ఎందరో తన దాతృత్వంతో వారు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంస్థ సేకరించిన విరాళాలతో కార్మికులకు ప్రయాణ సౌకర్యం, శానిటేషన్ కిట్లు అందిస్తూ వారు ఇళ్లకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది.