బన్నీ కోసం మారుతి కథ రెడీ అయిపోయిందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు, సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతికి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరూ చాలా క్లోజ్. ఇటీవలే మారుతి మాట్లాడుతూ తామిద్దరం వాట్సాప్ లో తరచూ టచ్ లోనే ఉంటామని చెప్పడం బట్టి చూస్తుంటే ఇద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఇది ఇప్పటిది కాదు. మారుతి దర్శకుడు అవ్వకముందు నుండి ఇద్దరూ టచ్ లో ఉండేవారు. దర్శకుడయ్యాక మారుతికి బన్నీతో సినిమా చేయాలని కోరిక. అయితే బన్నీతో చేసే సినిమా ఆషామాషీగా ఉండకూడదు. సూపర్బ్ కథ దొరికితే కానీ ముందుకెళ్లకూడదు అని ఫిక్సయ్యాడు. బన్నీకు కూడా మారుతితో సినిమా చేయడం ఇష్టమే. మారుతి ఎప్పుడు కథ తెస్తే అప్పుడు సినిమా చేద్దామని అన్నాడు కూడా.

ప్రతిరోజూ పండగే సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మారుతి ప్రస్తుతం బన్నీ కోసమే స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా రామ్ తో మారుతి సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి కానీ అవన్నీ రూమర్స్ అని స్వయంగా మారుతి స్పందించాడు. ఇక బన్నీ కోసం మారుతి తయారుచేస్తున్న స్క్రిప్ట్ దాదాపు పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే బన్నీకి ముందు కమిట్మెంట్స్ ఉన్నాయి. సుకుమార్ తో పుష్ప పూర్తి చేయాలి. ఐకాన్ సినిమా కూడా చేయాలి. ఈ మధ్యలో ఏదైనా గ్యాప్ వస్తే మారుతి సినిమా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మారుతికి కూడా కంగారేం లేదు. తనకు కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. సో ఇద్దరూ కలిసి పనిచేయడం పక్కా. అది ఎప్పుడనేది మాత్రం తెలీదు.