ఆ మహిళా క్రికెటర్.. అల్లు అర్జున్ కు వీరాభిమాని.. ఇన్ స్టాలో వెల్లడి

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా అల్లు అర్జున్ భారీ క్రేజ్ ఉంది. మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చినా తన డ్యాన్సులు, స్టైల్ తో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రతి సినిమాలో విభిన్నంగా కనిపించడం, డ్యాన్సుల్లో వైవిధ్యం, నటనలో పరిపక్వత చూపడంతో బన్నీకి ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ పెరిగిపోయారు. కేరళలో బన్నీ క్రేజ్ అక్కడి స్థానిక హీరోలతో సమానంగా ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ లిస్టులో భారతీయ మహిళా క్రికెటర్ కూడా చేరిపోవడం విశేషం.

మహిళల క్రికెట్లో జాతీయ జట్టులో సభ్యురాలు ప్రియా పూనియా. ఇండియా తరపున అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడుతోంది. రీసెంట్ గా తన ఇన్ స్టా అకౌంట్లో లైవ్ వీడియోలో ఫ్యాన్స్ లో చాట్ చేసింది. దీంతో ఓ నెటిజన్ సినిమాల్లో ఏ హీరో అంటే ఇష్టం అని అడిగిన ప్రశ్నకు ‘నేను అల్లు అర్జున్ అభిమాని’ని అని చెప్పుకొచ్చింది. దీంతో ప్రియా బన్నీ ఫ్యాన్స్ అని తెలిసింది. బన్నీ ఇంతవరకూ ఒక్క బాలీవుడ్ సినిమా చేయలేదు. కానీ.. అల.. వైకుంఠపురములో సినిమాలోని ‘బుట్ట బొమ్మ’ ద్వారా నార్త్ ఇండియన్స్ కు సుపరిచితుడయ్యాడు.

దీంతోపాటు బన్నీ సినిమాలకు యూట్యూబ్ లో డబ్బింగ్ వెర్షన్ లో హిందీలో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రియా బన్నీ ఫ్యాన్స్ అయి వుంటుందని అంటున్నారు. బన్నీ సాధించిన రేర్ ఫీట్స్ ఇదొకటని చెప్పాలి. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ఫ’ సినిమా చేస్తున్నాడు.