ఊహించని హీరో బన్నీ పుష్ప కోసం…

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. మారేడుమిల్లి అడవుల్లో ఈ షూటింగ్ ను కానిస్తున్నారు. బన్నీ పూర్తిగా రఫ్ అండ్ టఫ్ లుక్ లోకి మారిపోయిన ఈ చిత్రం తన కెరీర్ లోనే చాలా స్పెషల్ గా ఉంటుందని నమ్ముతున్నాడు. ఇటీవలే లీకైన బన్నీ లుక్ కు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాలో నటించే విలన్ పాత్రను కూడా ఫైనల్ చేయాల్సి ఉంది. సినిమాకు చాలా ముఖ్యమైన ఈ పాత్రను మొదట విజయ్ సేతుపతితో చేయిద్దామనుకున్నారు కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో విజయ్ తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ పాత్ర కోసం నారా రోహిత్, మాధవన్, మరో యువ హీరో అంటూ చాలా పేర్లు వినిపించాయి కానీ అవన్నీ కేవలం రూమర్స్ అని, ఏ మాత్రం నిజం లేదని తెలిసిపోయింది.

అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం చియాన్ విక్రమ్ ను ఈ పాత్ర కోసం అడగాలని నిర్ణయించుకున్నారట. సుకుమార్, బబన్నీ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ అయితే సౌత్ లో చాలా కంఫర్ట్ ఉంటుందని భావిస్తున్నారు. మరి చూడాలి విక్రమ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటాడో లేదో.