మొత్తం పది భాషల్లో పుష్ప రిలీజ్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప. అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బన్నీ చేస్తోన్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన 20వ సినిమాతో బన్నీకి ఇండస్ట్రీ హిట్ సాధ్యమైంది. దీంతో పుష్ప సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పుష్ప చిత్రాన్ని ప్యాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో పుష్ప విడుదలవుతోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం రిలీజ్ విషయంలో నిర్మాతలు సరికొత్త టర్న్ తీసుకున్నారు. పుష్ప చిత్రాన్ని ఏకంగా 10 భాషల్లో విడుదల చేస్తున్నారు. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక విలన్ గా ఎవరు నటిస్తారు అన్న విషయంపై సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. సుకుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.