ఎక్కడయినా బావే కానీ వంగతోట కాదు అన్నటైపు అల్లు అరవింద్. అందుకే ఆయన అంత సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ కాగలిగారు. కొడుకు అయినా సరే, ఎంత పెట్టాలో అంతే, ఎంత రాబట్టగలమో అంతే పెట్టుబడి. రిస్క్ లేకుండానే కొడుకును ప్రమోట్ చేసుకుంటూ వెళ్లాలి. ఇదీ ఆయన పాలసీ. అల్లు శిరీష్ను అలాగే మెల్ల మెల్లగా నిచ్చెన ఎక్కించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. సినిమా సినిమాకు బాగా గ్యాప్ వున్నా, ఏం ఫరవాలేదు అనుకుంటూ వెళ్తున్నారు.
లేటెస్ట్ గా ఓ తమిళ సినిమా రీమేక్ రైట్స్ కొన్నారు అల్లు అరవింద్. దాన్ని అల్లు శిరీష్ తో రీమేక్ చేయాలి.అంత వరకు ఓకె కానీ ఇక్కడే వచ్చింది జనరేషన్ గ్యాప్. ఆయనకు కొన్ని పడికట్టు లెక్కలు తెలుసు. శిరీష్ తో సినిమా చేస్తే, తన బ్యానర్ వాల్యూ తోడయితే, ఎంత వరకు మార్కెట్ చేయగలం అన్నది. ఆ మేరకే ఖర్చు చేద్దాం. రిస్క్ వుండదు. లాభం వస్తే వస్తుంది అని, ఆయన ప్లాన్. అందుకు అనుగుణంగా స్టార్ కాస్ట్, టెక్నికల్ టీమ్ సెట్ చేసే ఆలోచన ఆయనది.
అందరు హీరొలు మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. కాస్త కాసులు ఖర్చు చేయకపోతే ఔట్ పుట్ బాగుండదు. అందుకే కాస్త కలర్ ఫుల్ క్రేజీ స్టార్ కాస్ట్, క్వాలిటీ టెక్నికల్ కాస్ట్ వుండాలని అల్లు శిరీష్ ఆలోచన. ప్రస్తుతం ఇదే తండ్రీ కొడకుల మధ్య నడుస్తోంది అన్న ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తున్న గ్యాసిప్. ఈ బడ్జెట్ బేరాలు తేలేవరకు ఈ రీమేక్ రైట్స్ సినిమా అలాగే వుంటుంది. అది తేలితే పట్టాలు ఎక్కుతుంది.