అమిత్ షా ను కలిసిన రఘురామ కూతురు, కొడుకు

ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్ట్‌ తదుపరి జరుగుతున్న పరిణామాలను కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. రఘురామ కుమార్తె ప్రియదర్శిని, మరియు కుమారుడు భరత్‌ లు ఢిల్లీ వెళ్లి హోం మంత్రి అమిత్ షాను కలిసి తమ తండ్రి రఘురామపై రాజకీయ కుట్ర జరుగుతుందని తెలియజేశారు. ఏపీ ప్రభుత్వం కక్ష పూరితంగానే తమ తండ్రిని అరెస్ట్‌ చేసి వేదిస్తున్నారంటూ వారు అమిత్‌ షాకు వివరించారు.

దాదాపుగా పావుగంట సమయం పాటు ఇద్దరితో మాట్లాడిన అమిత్‌ షా వారికి హామీ ఇచ్చి పంపించారని తెలుస్తోంది. రఘురామ కృష్ణం రాజుకు ప్రాణ హాని ఉందనే అఉమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన్ను గుంటూరులో ఉంచవద్దని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎంపీ అయిన కారణంగా ఆయన్ను వెంటనే సెక్యూరిటీ ఎక్కువగా ఉండే జైలుకు తరలించాలంటూ డిమాండ్‌ కూడా వినిపిస్తుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ కేసు విషయంలో ఎలా స్పందిస్తారు.. జగన్‌ తో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా అనే విషయమై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.