విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్, దొరసాని చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా రెండో చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు మూడో చిత్రం పుష్పక విమానం చిత్రంతో వస్తున్నాడు. ఈ సినిమా రేపే విడుదల కానుంది.
కంటెంట్ బేస్డ్ సినిమాలకే తన ఓటు అని చెప్పిన ఆనంద్, స్టార్టింగ్ లో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి స్పందించాడు. “దొరసాని సమయంలో నాపై చాలానే ట్రోల్స్ వచ్చాయి. నేను నేపోటిజం ప్రోడక్ట్ అన్నారు. పర్లేదు. విరాట్ కోహ్లీ వంటి వారికే ట్రోల్స్ తప్పవు. నేను ఎంత” అని ఆనంద్ స్పందించాడు.
దొరసాని చిత్రాన్ని అయితే ఆర్ట్ సినిమాగా చేయాలి లేదా కమర్షియల్ మార్గంలో పోవాలి, మేము మధ్య దారిని ఎంచుకున్నాం. సరైన ఫలితాన్ని అందుకోలేకపోయాం. మిడిల్ క్లాస్ మెలోడీస్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండేది అని తెలిపాడు.