బాలీవుడ్‌పై దృష్టి పెట్టిన రంగమ్మత్త

హాట్‌ యాంకర్‌ అనసూయ తెలుగు బుల్లి తెర మరియు వెండి తెరలపై తనదైన శైలిలో ఆకట్టుకుంది. అందాల ప్రదర్శణతో పాటు ఆకట్టుకునే రూపంతో ఈ అమ్మడు దూసుకు పోతుంది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న ఈమె బుల్లి తెరపై ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఈ సమయంలోనే ఈమెకు హిందీ సీరియల్‌లో ఆఫర్‌ వచ్చింది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇకపై ఉత్తరాది బుల్లి తెరపై కూడా అనసూయ ప్రభంజనం కనిపించబోతుంది.

బాలీవుడ్‌లో సినిమా ఆఫర్‌ కోసం అనసూయ మెల్లగా హిందీ సీరియల్స్‌లో నటించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. హిందీ సీరియల్స్‌లో నటించిన వారు గతంలో హీరోయిన్స్‌గా మారిన విషయం తెల్సిందే. అందుకే ఈ అమ్మడు ఇప్పుడు హిందీ సీరియల్స్‌పై దృష్టి పెట్టింది. తనకున్న పరిచయాలతో ఈమె అక్కడ ఛాన్స్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసి సక్సెస్‌ అయ్యింది.

తెలుగులో ఈమెకు ఉన్న ప్రేక్షకాధరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలో ఐటెం సాంగ్స్‌కు కూడా ఈమె ఆసక్తిగా ఉంది. ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాదిలో అయినా అనసూయ బాలీవుడ్‌ స్క్రీన్‌ మీద ఐటెం సాంగ్‌ చేయడం ఖాయం అంటున్నారు. హిందీ ప్రేక్షకులు ఖచ్చితంగా అనసూయను నెత్తిన పెట్టుకుని మరీ అభిమానిస్తారని ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.