కనకాల ఫ్యామిలీ లో గొడవలు నిజం కాని..!

టాలీవుడ్ మరియు బుల్లి తెరకు మద్య వారది యాంకర్ సుమ అనడంలో సందేహం లేదు. టాలీవుడ్ లో మరియు బుల్లి తెరపై తనదైన ముద్రను వేసిన సుమ గత రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. నటిగా పరిచయం అయిన సుమ యాంకర్ గా సెటిల్ అయ్యింది. సుదీర్ఘ కాలంగా యాంకర్ గా కొనసాగుతున్న సుమ మళ్లీ నటిగా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు ఆమె తాజా చిత్రంను బట్టి అర్థం అవుతుంది.

జయమ్మ పంచాయతి అనే సినిమా తో నటిగా వెండి తెరపై రీ ఎంట్రీకి సిద్దం అయ్యింది. ఆమె సినిమా ఇండస్ట్రీలో లేకున్నా కూడా ఆమె లేకుండా పెద్ద హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్ లు లేవు.. సక్సెస్ మీట్స్ లేవు. కనుక ఆమె ఇండైరెక్ట్ గా ఇండస్ట్రీలోనే ఉంది. ఇక సుమ ప్రథాన పాత్రలో జయమ్మ పంచాయతి సినిమాలో నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. ప్రముఖ హీరోలు ఆమె సినిమాను ప్రమోట్ చేసేందుకు సిద్దంగా ఉన్నారు.

సుమ ప్రథాన పాత్ర లో నటించిన సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సమయంలోనే ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంది. పలు యూట్యూబ్ ఛానల్స్ తో పాటు కార్యక్రమాల్లో ఆమె కనిపిస్తుంది. తాజాగా అలీ తో సరదాగా టాక్ షో లో పాల్గొంది. ఆ షో లో అలీ పలు ప్రశ్నలను సుమను అడిగి సమాధానాలు రాబట్టాడు.

అందులో భాగంగానే రాజీవ్ కనకాలతో విభేదాల గురించి కూడా అడిగాడు. ఆ మద్య వీరిద్దరి మద్య గొడవలు జరుగుతున్నాయి.. విడి పోయే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. ఇద్దరు వేరు వేరు ఉంటున్నారు అంటూ చాలా బలంగా వార్తలు వచ్చాయి. ఆ విషయం నిజం కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని స్వయంగా సుమ గొడవలు నిజమే అంటూ క్లారిటీ ఇచ్చింది.

భార్యాభర్తలు అన్నప్పుడు ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. కనుక మా మద్య కూడా గొడవలు జరిగాయి. మేము విడి పోలేదు. భార్య భర్తలు విడిపోవడం ఈజీనే కాని తల్లిదండ్రులు విడిపోవడం కాస్త కష్టం అంటూ సుమ తమ మద్య గొడవలు జరిగాయి కాని పిల్లల కోసం కలిసి ఉంటున్నట్లుగా చెప్పకనే చెప్పింది.

సుమ ప్రస్తుతం రాజీవ్ కనకాలతో సన్నిహితంగా ఉంటుంది. ఈమద్య కాలంలో ఇద్దరు అన్ని చోట్ల కలిసి సందడి చేస్తున్నారు. ఇద్దరు కలిసి కొడుకును హీరోగా పరిచయం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే.