కరుణ ఊపును తట్టుకోవడం అసాధ్యమనే!

ఇప్పటికే అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకేలో వారసత్వ కుమ్ములాటలు జరిగాయి. రెండు వారాల సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా తర్వాత శశికళను అన్నాడీఎంకేప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇప్పుడు డీఎంకేలో కూడా వారసత్వ పోరాటం మొదలైంది.

చెన్నైలో కరుణానిధి నివాసం, డీఎంకే ఆఫీస్ లో కీలక మార్పులు జరగబోతున్నాయి. స్టాలిన్ పార్టీ అధ్యక్షుడౌతారనేది అందరి భావన. అటు కింగ్ మేకర్ అళగిరికూడా పార్టీలోకి తిరిగి వస్తారట. కనిమొళికి కూడా కీలక పదవి దక్కబోతోంది.

స్టాలిన్ ఇప్పటికే కరుణ వారసుడిగా ప్రచారంలోకి రావడమే కాదు.. నిలదొక్కుకున్నారు కూడా. శశికళను సీఎం కానీయబోమని స్టాలిన్ ప్రకటించారని చెన్నైలోపుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదే నిజమైతే ఇప్పుడు అన్నాడీఎంకే నుంచి 20 మంది డీఎంకేలోకి గోడ దూకేశారనేది కొత్త అనుమానం.

ఇప్పటికే అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకే క్యాడర్ చూపు డీఎంకే వైపు పడింది. ఇక అళగిరి, స్టాలిన్, కనిమొళి మధ్య గొడవలు కూడా పరిష్కారమైతే.. ఇక కరుణపార్టీ ఊపును తట్టుకోవడం అసాధ్యమనేది అన్నాడీఎంకే నేతల భయం .