బాహుబలి సినిమా తర్వాత అనుష్క స్టార్ డం అమాంతం పెరగడం ఖాయం. ఆమె పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పెద్ద సినిమాల్లో నటించడం ఖాయం అనుకున్న వారందరికి కూడా షాక్ ఇచ్చింది. బాహుబలి చేస్తున్న సమయంలోనే సైజ్ జీరో చేసి బరువు బాగా పెరిగింది. ఆ సినిమా కోసం పెరిగిన బరువు తగ్గేందుకు ఇంకా అనుష్క ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అనుష్క స్లిమ్ గా అయితే చూడాలని ఆశ పడుతున్న అభిమానులకు నిరాశనే మిగుల్చూతూ వచ్చింది. ఇటీవల విడుదల అయిన నిశబ్దంలో కూడా ఆమె బొద్దుగానే కనిపించింది. కొన్ని సీన్స్ లో మరీ ఎబ్బెట్టుగా కనిపించకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో గ్రాఫిక్స్ ను ఉపయోగించి సన్నగా చేశారు.
నిశబ్దం పూర్తి అయ్యి ఏడాది దాటింది. కాని ఇప్పటి వరకు ఈమె కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించిందే లేదు. అనుష్క ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటుంది అంటే బరువు తగ్గే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. నిశబ్దంకు ముందు కూడా అనుష్క బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని నిశబ్దంలో కూడా ఆమె లావుగానే కనిపించింది. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడు టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనుష్క మాత్రం బరువు తగ్గి స్లిమ్ గా అయిన తర్వాతే షూటింగ్ కు జాయిన్ అవుతాను అంటూ చెప్పుకొచ్చిందట.