‘ఎన్నార్సీ, ఎన్ పీఆర్’లకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం.. అసెంబ్లీలో తీర్మానం

వివాదాస్పద ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ బిల్లుకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. గతంలో పేర్కొన్న విధానానికే తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఈ తీర్మానాన్ని భోజన విరామంలో ప్రవేశపెట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ వివాదాస్పద బిల్లును గత ఏడాది తీసుకొచ్చింది. అప్పట్లోనే దీనిపై పలు రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి.

దీనిపై అంజాద్ బాషా మాట్లాడుతూ.. ఎన్ పీఆర్ (నేషనల్ పాపులేషన్ ఆఫ్ రిజిస్ట్రార్) లో కొత్తగా పొందుపరచిన అంశాలు ముస్లింలో భయాందోళనలు రేకెత్తాయని అన్నారు. 2020లో చేసిన ఫార్మాట్ లో తల్లిదండ్రుల వివరాలు, పుట్టిన తేదీ, ప్రదేశం, మాతృభాష.. ఇలా కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో 2010 ప్రకారం ఉన్న ఎన్ పీఆర్ ను అమలు చేయాలని తాము కేంద్రాన్ని కోరామన్నారు.

ఏపీలో ఎన్ఆర్సీని అమలు చేయమని సీఎం జగన్ గతంలోనే స్పష్టం చేశారని అన్నారు. ఈమేరకు మర్చిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్ఆర్సీ, ఎన్ పీఆర్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు రోజులుగా జరిగిన సమావేశాల్లో ఎన్‌ఆర్‌పీ, ఎన్‌పిఆర్‌ సవరణ బిల్లులను కూడా శాసనసభ ఆమోదించింది. మొత్తం 15 బిల్లులకు అసెంబ్రీ ఆమోదం తెలిపింది.

ఈసారి బడ్జెట్ , గవర్నర్ ప్రసంగాలపై ఎలాంటి చర్చా జరగలేదు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ చర్చలు లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ కు అసెంబ్లీ సంతాపం తెలిపింది.