ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహ్మాన్ ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్ట్‌లతో పాటు అంతర్జాతీయ ప్రాజెక్ట్ లతో కూడా చాలా బిజీగా ఉన్నారు. ఇండియాలో టాప్ మ్యూజిక్ కంపోజర్ గా దూసుకు వెళ్తున్న రహ్మాన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి కరీమా బేగం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మృతితో రహ్మాన్ కుటుంబ సభ్యులు అంతా కూడా శోఖంలో మునిగి పోయారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కరీమా బేగం ఆరోగ్యం మరింతగా విషమించడంతో మృతి చెందినట్లుగా వైధ్యులు తెలియజేశారు.
ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ లలో మొదటి ఆస్కార్ అవార్డు గ్రహీతగా గుర్తింపు దక్కించుకున్న రహ్మాన్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ రేంజ్ తో దూసుకు పోతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని రహ్మాన్ అభిమానులు కోరుకుంటున్నారు.