ఎప్పుడో ఫైనాన్స్ సమస్యలతో ఆగిపోయింది గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమా. వక్కంత వంశీ కథ కు బి గోపాల్ డైరక్షన్. ఈ సినిమా సగంలోనే ఫైనాన్స్ సమస్యలు ఎదుర్కొంది. దాంతో నిర్మాత పివిపి ఎంటరై తొమ్మిది కోట్లు ఇచ్చి దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తరువాత దాన్ని రెడీ చేసి విడుదల చేసే టైమ్ కు మిగిలిన ఫైనాన్సియర్లు ఎంటర్ అయ్యారు. వ్యవహారం కోర్టుకు చేరింది. సినిమా విడుదల ఆగిపోయింది.
ఇప్పడు ఈ సినిమాను ఓటిటికి అమ్మేసి, అప్పుులు క్లియర్ చేయించుకునే ఆలోచన చేస్తున్నారు నిర్మాత తాండ్ర రమేష్. ఈ సినిమాకు దాదాపు అప్పులు అన్నీ కలిసి అసలు మొత్తాలే 17 కోట్ల వరకు వుంటాయని తెలుస్తోంది. వడ్డీల సంగతి తెలియదు. ఇప్పుడు ఓటిటికి విక్రయిస్తే ఎంత వస్తే అంతా కోర్టుకే కట్టేస్తా అనే షరతు మీద కోర్టు నుంచి నిర్మాత అనుమతి కోరే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ ఇక్కడ ఇంకో సమస్య కూడా వుంది. సినిమాను గతంలో డిజిటల్ ప్లస్ శాటిలైట్ కలిపి జీ టీవీ కి ఏడు కోట్ల మేరకు అమ్మేసారు. అందువల్ల ఇప్పుడు అక్కడ కూడా మళ్లీ మొదటి నుంచీ స్టార్ట్ చేయాలి. అప్పుడు ఇచ్చింది థియేటర్ విడుదల నేపథ్యంలో. ఇప్పుడు డైరక్ట్ ఓటిటి. అందువల్ల ఆ దిశగా కూడా చర్చల వ్యవహారం వుంటుంది.
ఏమైనా ఈ దిశగా ప్రయత్నం నిర్మాత మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.