బిగ్‌బాస్ ఉత్సవంలో ‘అవియానా’ రొమాంటిక్‌ డాన్స్‌

తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ఈమద్య రెగ్యులర్‌ గా ఏదో ఒక షో ద్వారా కనిపిస్తూనే ఉన్నారు. ఈ ఆదివారం స్టార్ మా లో బిగ్ బాస్ ఉత్సవం అంటూ ఒక భారీ కార్యక్రమంను ప్లాన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీజన్‌ 4 కంటెస్టెంట్స్ తో పాటు గత సీజన్ ల కంటెస్టెంట్స్ కూడా సందడి చేశారు. ముఖ్యంగా అవినాష్‌ మరియు అరియానాలు చేసిన ఫెర్ఫార్మెన్స్‌ షో కు హైలైట్ గా నిలిచింది అంటూ షో నిర్వహకులు అంటున్నారు. ఈ సీజన్‌ కంటెస్టెంట్స్ మొత్తం కూడా చాలా సందడిగా చేయడంతో పాటు ఎంటర్ టైన్‌ చేశారు.

అవినాష్‌ మరియు అరియానాలు హౌస్‌ లో ఉన్న సమయంలో చాలా క్లోజ్‌ గా ఉన్నారు. ఇద్దరి మద్య ఏదో ఉందనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారం కంటిన్యూ చేసే విధంగా వారిద్దరు కూడా కొన్ని సందర్బాల్లో రొమాంటిక్ గా ఉండటం ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకోవడం వంటివి చేశారు. దాంతో బిగ్‌ బాస్ సీజన్‌ 4 కు వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక బిగ్‌ బాస్ ఉత్సవంలో వారి జోడీ ఆకట్టుకునేలా రొమాంటిక్‌ డాన్స్ చేశారు. వీరిద్దరి డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.