బిబి4 Episode 85 : మరోసారి జలజతో ఆట, ఈసారి అంతా సేఫ్‌

తెలుగు బిగ్‌ బాస్‌ మరో వారం పూర్తి చేసుకుంది. ఆదివారం ఎపిసోడ్‌ లో ఒకరు ఎలిమినేట్‌ అవ్వాల్సి ఉన్నా కూడా అవినాష్‌ కు ఉన్న పాస్ కారణంగా సేవ్‌ అయ్యాడు. మరో మూడు వారాలు ఉన్న కారణంగా రాబోయ్యే రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్‌ అవ్వబోతున్నారు. చివరకు అయిదుగురు ఫైనల్‌ లో నిలుస్తారు. ఆదివారం ఎపిసోడ్‌లో ప్రత్యేక గెస్ట్‌గా సుదీప్‌ సందడి చేశారు. ఆయన కన్నడ బిగ్‌ బాస్‌ కు ఏడు సీజన్‌ లకు గాను హోస్టింగ్‌ చేశాడు. ఈ సందర్బంగా ఇంటి సభ్యులతో సుదీప్‌ సందడి చేశాడు. ఆయన ప్రతి ఒక్క ఇంటి సభ్యుడికి ఒక ప్రశ్న ఇచ్చాడు.

అంతకు ముందు నాగార్జున మరోసారి జలజ వద్దకు ఇంటి సభ్యులను ఒక్కొక్కరిగా పంపించాడు. కన్ఫెషన్‌ రూంను మళ్లీ జలజ రూం గా మార్చి మూడు వస్తువులను తీసుకు రావాలంటూ ప్రతి ఒక్క ఇంటి సభ్యులను నాగార్జున పంపించాడు. మోనాల్‌ ఈజీగా వెళ్లి తీసుకు వెళ్లింది. అభిజిత్‌ మరియు హారిక లు కూడా వెళ్లి తీసుకు వచ్చారు. కాని అఖిల్‌ మరియు సోహెల్‌ లు కాస్త భయపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా వెళ్లిన సమయంలో నవ్వులు పూశాయి. మొత్తానికి బిగ్‌ బాస్‌ లోని ప్రతి ఆదివారం మాదిరిగానే ఈ ఆదివారం ఎపిసోడ్‌ కూడా ఫన్‌ డే గా ముగిసింది.

ఇక సుదీప్‌ వచ్చిన సమయంలో అఖిల్‌ ను సేవ్‌ చేయడం జరిగింది. ఆసమయంలో అఖిల్‌ బాగా ఎమోషనల్‌ అయ్యాడు. సోహెల్‌ మరియు అఖిల్‌ లు కన్నీరు పెట్టుకున్నారు. ఇక చివరకు మిగిలి ఉన్న అరియానా మరియు అవినాష్‌ ల్లో ఒక్కరు సేవ్‌ అవుతారు. ఆ తర్వాత ఒకరు ఇంటికి వెళ్తారు అంటూ అవినాష్‌ కు పాస్‌ ఉంది కనుక అతడు సేవ్‌ అవుతాడా లేడా అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో అవినాష్‌ నేను నా పాస్‌ ఉపయోగించుకోవాలంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు. అతడు పాస్‌ ఉపయోగించడం మంచిది అయ్యింది. అరియానా సేవ్‌ అయ్యింది. అవినాష్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. ఆ సమయంలో పాస్‌ ఉండటం వల్ల సేవ్‌ అయ్యాడు.