మెగా ఫ్యాన్‌ కు బాలయ్య ఫ్యాన్‌ ఆర్థిక సాయం

ఫ్యాన్స్ మద్య గొడవలు తరుచు జరుగుతూ ఉంటాయి. హీరోలు బాగానే ఉంటున్నా వారి అభిమానులు మాత్రం పదే పదే గొడవలు పడటం పట్ల ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఆమద్య ఇద్దరు స్టార్‌ హీరోల అభిమానులు గొడవ పడి ఒకరి మృతికి కూడా కారణం అయ్యింది. అలాంటి అభిమానులు ఉన్న రాష్ట్రంలోనే మంచి అభిమానులు కూడా ఉన్నారని నిరూపతం అయ్యింది. తాజాగా కడప కు చెందిన మెగా అభిమాని అనారోగ్యంతో బాధపడుతుంటూ అదే కడపకు చెందిన బాలయ్య అభిమాని ఆర్థిక సాయం చేయడం చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్ అసోషియేషన్‌ అధ్యక్షుడు సురేష్‌ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. విషయం తెలిసిన కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు పీరయ్య స్వయంగా ఆసుపత్రికి వెళ్లి సురేష్‌ ను పరామర్శించడంతో పాటు రూ.20 వేల రూపాయల ఆర్థిక సాయంను కూడా అందించడం జరిగింది. ఈ విషయం ప్రస్తుతం మెగా మరియు నందమూరి అభిమానుల మద్య చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బాలయ్య అభిమానులు విషయాన్ని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తున్నారు.