బాలయ్య, బోయపాటి చిత్రానికి రిలీజ్ టెన్షన్ పట్టుకుందా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోన్న విషయం తెల్సిందే.

ఇంకా టైటిల్ ను ప్రకటించని ఈ సినిమాను మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా తెలియజేసారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ టార్గెట్ ను అందుకోవడం కష్టమనే అంటున్నారు.

ఎందుకంటే ఈ సినిమా ఇంకా 40 శాతం చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. మాములు సమయాల్లో అయితే ఈ టైమ్ చాలు కానీ ప్రస్తుతం కోవిద్ సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. దీనివల్ల షూటింగులకు ఏమాత్రం అంతరాయం వచ్చినా కానీ బాలయ్య సినిమా వాయిదా పడడం ఖాయం.