బాలకృష్ణతో సినిమాను అనౌన్స్ చేయనున్న అల్లు అరవింద్?

మెగా క్యాంప్, నందమూరి క్యాంప్ మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది అన్నది ఎప్పటినుండో ఉన్న వార్త. పైకి చిరంజీవి, బాలకృష్ణ బాగానే ఉన్నా కానీ వారి ఫ్యాన్స్ మధ్య మాత్రం ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే రీసెంట్ గా అల్లు ఫ్యామిలీ, బాలకృష్ణకు దగ్గర కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

అల్లు అరవింద్ ఆహా కోసం బాలయ్య టాక్ షో చేయడానికి ముందుకు రావడం, అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ విచ్చేయడం, అన్ స్టాపబుల్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా రావడంతో వీరి బంధం బలపడింది.

ఇప్పుడు అల్లు అరవింద్ దీన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణతో త్వరలోనే అరవింద్ ఒక చిత్రాన్ని అనౌన్స్ చేయబోతున్నాడట. బాలకృష్ణ కమిట్మెంట్ ఇచ్చాడని, అయితే అరవింద్ సరైన దర్శకుడి కోసం చూస్తున్నట్లు సమాచారం.