మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో ప్రధానంగా కొత్తగా అనిపించింది వేటపాలెం బ్యాచ్ గురించే. ప్రకాశం జిల్లాలోని వేటపాలెం అనే ఊరు పాయింట్, దాని చుట్టూ అల్లిన ఎపిసోడ్ కొత్తగా అనిపించింది.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని వేటపాలెం ఊర్లో ఉంటున్నాడు. దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉన్న లైబ్రరీ ఇక్కడ ఉంది. గోపీచంద్ మలినేని తన సమయాన్ని లైబ్రరీలో గడుపుతున్నాడు. తన తర్వాతి సినిమా స్క్రిప్ట్ కోసం ఇక్కడి లైబ్రరీలో వివిధ అంశాలపై శోధిస్తున్నాడు.
గోపీచంద్ మలినేని తన తర్వాతి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నాడు. ఈ సినిమా ప్రకటన త్వరలోనే రానుంది. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్ర టీజర్ ఉగాది సందర్భంగా విడుదలై భారీ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.