‘పోసాని చావు ఎంత భయంకరంగా ఉంటుందో..’ బండ్ల గణేష్ వాఖ్యలు

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ రగిలించిన జ్వాల ఇంకా చల్లారలేదు. ఆయన స్పీచ్ తర్వాత పవన్ వర్సెస్ ఏపీ పాలిటిక్స్ అనేంతగా మారిపోయాయి పరిస్థితులు. ఈనేపధ్యంలో పవన్ పై నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పందిస్తూ పోసానిపై ఫైర్ అయ్యారు.

పవన్ అంటే ఇష్టం లేకపోతే ఆయన్ను తిట్టండి.. నిరసనలు చేయండి.. కానీ.. ఆయన కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడం ఎంతవరకూ సబబు. దేవుడనేవాడు ఉంటే.. పోసానీ.. నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో చూడు. పోసాని ఎక్స్ పెయిరీ డేట్ అయిపోయిన టాబ్లెట్ వంటి వాడు’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోసాని వ్యాఖ్యలతో పవన్ అభిమానులు, జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం పై పవన్ వాఖ్యలు.. పవన్ పై మంత్రులు చేసిన వ్యాఖ్యలు.. సినీ పరిశ్రమ స్పందనతో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.