మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇంతింతై అన్నట్లుగా ఎదిగి మెగాస్టార్ గా శిఖరాగ్రాన్ని చేరుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ఎందరికో ఆదర్శప్రాయం. కమెడియన్ నుండి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ కు చిరంజీవి అంటే వల్లమాలిన అభిమానం.
ఈ నేపథ్యంలో ఇటీవలే ట్విట్టర్ స్పేస్ లో మాట్లాడుతూ ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా చిరంజీవి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈరోజు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారంటే అది మాటలు కాదని ఆయన జీవితాన్ని పాఠ్యపుస్తకాలలో చేరిస్తే అది ఎందరో పిల్లలకు ఆదర్శప్రాయమవుతుందని బండ్ల గణేష్ అన్నారు.
ఈ డిమాండ్ సరికొత్తగా ఉండడంతో మెగా ఫ్యాన్స్ అందరూ సంతోషంగా సోషల్ మీడియాలో దీన్ని ట్రెండ్ చేస్తున్నారు. మరి ఆ దిశగా అడుగులు ఏమైనా పడతాయేమో చూడాలి.