లావణ్య త్రిపాఠికు ‘బంగార్రాజు’ బై బై


నాగార్జున ఈ మద్యన తన ఇంటర్వూలలో బంగార్రాజు సినిమా చేస్తున్నాడని చెప్పారు. ఆ సినిమా సోగ్గాడే చిన్ని నాయనే కు ప్రీక్వెల్ కావటంతో మంచి ఎక్సపెక్టేన్షే ఉన్నాయి. ఇప్పటికే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్టు పూర్తి ప్రొడక్షన్ ప్రారంభబించటానికి రెడీగా ఉన్నారు. కరోనా కాస్త స్పీడు తగ్గి యధాస్దితికి రాగానే షూటింగ్ మొదలెట్టేద్దామనుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో ఈ సినిమా పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా అందరిలో ఒకటే ప్రశ్న..ఈ సినిమాలో లావణ్య త్రిపాఠీ చేస్తుందా లేదా అని.

వాస్తవానికి లావణ్య త్రిపాఠి సినీ కెరీర్ ప్రారంభించి చాలా కాలమే అవుతుంది. అయితే ఆశించిన స్థాయిలో ఆమె కెరీర్ జోరందుకోలేదు. ‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా 2012లో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ. ఆ తర్వాత.. ఆమె పలు సినిమాల్లో నటించినా నాని – మారుతి కాంబినేషన్లో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ తో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో తన నటనకు మంచి పేరొచ్చింది.

ఇటీవల అర్జున్ సురవరంలో హిట్ అందుకున్న ఆమె సందీప్ కిషన్ జోడిగా ఎ1 ఎక్సప్రెస్ లోనూ చేసింది. కార్తికేయ సరసన చేసిన చావు కబురు చల్లగా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ నేపధ్యంలో బంగార్రాజు సినిమాలోనూ ఆమెకు ఛాన్స్ దక్కిందా లేదా అన్నది డిస్కషన్ పాయింట్ గా మారింది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో లావణ్యకు క్యారక్టర్ లేదట. బంగార్రాజు ప్రీక్వెల్ కాబట్టి ఆ అవకాసం లేదని అంటున్నారు. సీక్వెల్ అయితే ఖచ్చితంగా ఆమె పాత్ర కొద్ది సేపు అయినా పెట్టేవారంటున్నారు.