సక్సెస్ లతో సంబంధం లేకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈయన భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమాల ఫలితాలు తేడా కొట్టినా కూడా నిరాశ చెందకుండా మరిన్ని సినిమాలను చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు కమర్షియల్ గా బిగ్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయిన ఈ యంగ్ హీరో బాలీవుడ్ లోకి చత్రపతి సినిమా తో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. వినాయక్ దర్శకత్వంలో ఈ రీమేక్ పట్టాలెక్కాల్సి ఉంది. కాని కరోనా కారణంగా ఆలస్యం అవుతోంది.
చత్రపతి రీమేక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయినా కూడా ప్రారంభంకు సమయం పడుతున్న నేపథ్యంలో ఈ సమయంలోనే కొత్త సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. బెల్లంకొండ హీరోగా తమిళ హిట్ మూవీ కర్ణన్ ను రీమేక్ చేయబోతున్నారు. ధనుష్ హీరోగా రూపొందిన కర్ణన్ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ధనుష్ పాత్రలో బెల్లంకొండ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ రీమేక్ ను అనుకున్నారు. కాని తాజాగా వినాయక్ ఈ రీమేక్ కు కూడా దర్శకత్వం వహించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చత్రపతి సినిమా ప్రారంభంకు సమయం పట్టే అవకాశం ఉంది. కనుక ఈ గ్యాప్ లో కర్ణన్ సినిమాను చేయాలని బెల్లంకొండ – వినాయక్ లు భావిస్తున్నారట.