పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్ ఫుల్ రన్ కు చేరుకుంటోంది. సెకండ్ వీక్ నుండే భీమ్లా నాయక్ బాగా స్లో అయింది. ఇక సెకండ్ వీకెండ్ లో కూడా పెద్దగా పుంజుకుంది లేదు. అయితే భీమ్లా నాయక్ మొదటి వీకెండ్ సాధించిన అద్భుతమైన కలెక్షన్స్ తోనే దాదాపుగా 70 శాతం కలెక్షన్స్ ను రాబట్టేసింది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల కారణంగా అక్కడ ప్రధానంగా నష్టపోయిన భీమ్లా నాయక్ 100 కోట్ల షేర్ ముంగిట నిలుస్తుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ స్టామినాతో భీమ్లా నాయక్ ఎబోవ్ యావరేజ్ చిత్రంగా నిలుస్తోంది.
ఇక ఈ చిత్ర ఓటిటి రిలీజ్ ఎప్పుడన్న సస్పెన్స్ కు కూడా తెరపడింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహాలో భీమ్లా నాయక్ మార్చ్ 25 నుండి స్ట్రీమ్ కానుంది.