బిగ్ బాస్4: ఎపిసోడ్52- డే కేర్‌ టాస్క్‌లో అరియానా, అవినాష్‌, హారిక పిల్లలుగా రచ్చరచ్చ

బిగ్‌ బాస్‌ నిన్నటి ఎపిసోడ్‌ లో కూడా చాలా సేపు నామినేషన్‌ పక్రియ గురించి చర్చ జరిగింది. అమ్మ రాజశేఖర్‌ ను సోహెల్‌ నామినేట్‌ చేసిన విషయమై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత అభిజిత్‌ ఈసారి నామినేషన్‌ లో లేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ లాస్య కూడా కామెడీ చేసింది. ఇక నోయల్‌ చాలా సేఫ్‌ గా బలమైన కంటెస్టెంట్స్‌ అంటూ నామినేట్‌ చేయడం జరిగిందని కూడా సోహెల్‌ మాట్లాడాడు. ఇక అరియానా తాను నామినేషన్‌ లోకి వెళ్లడంతో చాలా మూడీగా ఉంది. మరో వైపు అభిజిత్‌ మరియు మోనాల్‌ ల మద్య ఉన్న గొడవను తీర్చేందుకు అఖిల్‌ ప్రయత్నించాడు. మోనాల్‌ తో మాట్లాడాల్సిందిగా అభిజిత్‌ వద్దకు వెళ్లి అఖిల్‌ అడుగా తర్వాత మాట్లాడుతాను అంటూ అభిజిత్‌ అనడం జరిగింది.

ఇక ఈ వారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ బిబి డే కేర్‌ సెంటర్‌. ఈ టాస్క్‌ లో భాగంగా ఇంటి సభ్యులు రెండు టీమ్‌ లుగా విడిపోవాల్సి ఉంటుంది. పిల్లలుగా అవినాష్‌, అరియానా, మెహబూబ్‌ మరియు అమ్మరాజశేఖర్‌. ఇక కేర్‌ టేకర్స్‌ గా అరియానాకు సోహెల్‌, అవినాష్‌ కు నోయల్‌, మెహబూబ్‌ కు అఖిల్‌ మరియు అమ్మ రాజశేఖర్‌ కు అభిజిత్‌ వ్యవహరించాల్సి ఉంటుంది. పిల్లలు చాలా అల్లరి చేస్తూ గొడవ గొడవ చేస్తూ ఉంటారు. కేర్‌ టేకర్స్‌ వారిపై కోపం తెచ్చుకోకుండా వారిని జాగ్రత్తగా చూస్తు ఉండాలి. వారికి డైపర్లు మార్చడంతో పాటు వారికి సంబంధించిన లంచ్‌ స్నాక్స్‌ ఇలా అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

టాస్క్‌ లో భాగంగా సోహెల్‌ ను అరియానా ఒక ఆట ఆడేసుకుంటుంది. సోహెల్‌ మీది నుండి కిందకి దిగడం లేదు. అతడిపై తనకున్న కోపం మొత్తం తీర్చకుంటున్నట్లుగా అనిపించింది. ఇక అవినాష్‌ ను పాంపర్‌ చేయడం నోయల్‌ కు సమస్యగా మారింది. నోయల్‌ పెద్దగా ఇంట్రస్ట్‌ లేనట్లుగా వ్యవహరించాడు. హారిక పరుగులు పెడుతుంటే మోనాల్‌ తన కాలు నొప్పితో అలాగే ఆమెను సాధ్యం అయినంత వరకు ఆడించేందుకు ప్రయత్నించింది.

అమ్మ రాజశేఖర్‌ ను సైతం అభిజిత్‌ ఒక మోస్తరుగా ఆడించే ప్రయత్నం చేశాడు. అఖిల్‌ కూడా మెహబూబ్‌ అల్లరి భరించలేక చిరాకు పడ్డాడు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌ లో పిల్లల అల్లరితో కేర్‌ టేకర్స్‌ తలబొప్పి కట్టింది. నేటి ఎపిసోడ్‌ లో ఆ టాస్క్‌ కంటిన్యూ అయ్యి మరింతగా కేర్‌ టేకర్స్‌ కు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. నిన్నటి ఎపిసోడ్‌ లో హారిక మరియు అరియానాల మద్య చిన్న గొడవ జరిగింది. అది కొద్ది సమయం చర్చ జరిగింది.