బిగ్ బాస్ 4: సర్ప్రైజింగ్ రీతిలో ఇంటి కెప్టెన్ అయిన హారిక

బిగ్ బాస్ అంటేనే అంచనాలకు తగ్గట్లుగా సాగని ఒక రియాలిటీ షో. ఈ సీజన్ కూడా ఇందుకు మినహాయింపు ఏం కాదు. అయితే బిగ్ బాస్ 4 కొన్ని కారణాల వల్ల టీఆర్పీల కోసం స్ట్రగుల్ అవుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వీక్ ఎపిసోడ్ అంతా కంటెస్టెంట్ ల ఇంటి సభ్యులు హౌజ్ లోకి ప్రవేశించడంతో పూర్తి ఎమోషనల్ గా మారిపోయిన విషయం తెల్సిందే.

ఈ వారం కమాండర్ టాస్క్ జరుగుతోంది. ఈ టాస్క్ లో భాగంగా అభిజీత్, అఖిల్, హారికలు పెర్ఫార్మన్స్ పరంగా అందరినీ ఆకట్టుకున్న విషయం తెల్సిందే. ఇక హారిక ఇప్పటికే కెప్టెన్సీ టాస్క్ ల విషయంలో చాలా సార్లు పోటీ పడి ఓడిపోయింది. ఇదే విషయాన్ని హారిక వాళ్ళ అమ్మ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు గుర్తు చేసారు. ఈసారైనా కెప్టెన్ అవుతావా అని అడగడంతో అక్కడ అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.

అయితే ఆ మాటలకు తగ్గట్లుగానే హారిక ఈసారి సర్ప్రైజింగ్ రీతిలో కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ ఈరోజు టెలికాస్ట్ అవుతోంది. ప్రస్తుతం అఖిల్ ఇంటి కెప్టెన్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ రియాలిటీ షో చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఇంటి కెప్టెన్ అవ్వడం అనేది హారికకు చాలా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.