తెలుగులో బిగ్ రియాలిటీ షోగా బిగ్ బాస్ మంచి పేరు దక్కించుకుంది. సీజన్ 4లో భాగంగా ఇప్పటికే 76 రోజులుగా ఈ షో జరుగుతోంది. ఈ షోలో దాదాపు అందరు కంటెస్టెంట్స్ కొత్త వారే అయినా ప్రేక్షకులకు వినోదం అందించారు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లతో వారం మొత్తం సరదాగా.. వీకెండ్ లో నాగార్జున హోస్టింగ్ తో బిగ్ బాస్ మరింత రసవత్తరంగా ఈ షో కొనసాగుతోంది. ప్రతివారం ఒకొక్కరిగా ఎలిమినేట్ అయ్యే ఈ షోలో ఈవారం ఎలిమినేషన్ పై వార్తలు వస్తున్నాయి.
ఈ వారం జరిగే ఎలిమినేషన్ లో ప్రముఖ యాంకర్ లాస్య ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్స్ లో సొహాయిల్, అరియానా, హారిక, లాస్య, అభిజీత్, మోనాల్ ఉన్నారు. అయితే.. వీరందరిలో లాస్య బిగ్ బాస్ షో నుంచి బయటకెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ జరిగిన షోలో లాస్య టఫ్ కాంపిటీటర్ కాదనే విమర్శలు ఉన్నాయి. సేఫ్ గేమ్ ఆడుతూనే ఇప్పటివరకూ లాస్య తన గేమ్ ఆడిందని కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం గేమ్ చివరి దశకు వస్తోంది.
ఈ టైమ్ లో ఎలిమినేషన్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటూనే టెన్షన్ క్రియేట్ చేస్తూంటుంది. ఈ పరిస్థితుల్లో లాస్య ఎలిమినేషన్ ఆమెను బాధించేదే. ఈ వారం గేమ్స్ కంటే ఎక్కువగా సెంటిమెంట్ ఎక్కువగా కొనసాగింది. కంటెస్టెంట్స్ అందరి కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్ కి వచ్చారు. లాస్య భర్త, కొడుకు హౌస్ కు వచ్చి లాస్యను కలిసి వెళ్లారు. ఇప్పుడు మొత్తంగా షో నుంచే లాస్య హౌస్ వదిలి వెళ్లడం నిజమే అయితే ఆమెకు ఇది షాకింగ్ అనే చెప్పాలి.