బిగ్ బాస్4: ఎపిసోడ్81- దెయ్యం జలజ పిచ్చి టాస్క్‌లు, ఫస్ట్‌ టైం అభిజిత్‌ కన్నీరు

బిగ్‌ బాస్‌ ఈ వారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ లో భాగంగా దెయ్యం తో ఆట మొదలు పెట్టాడు. అరియానాకు దెయ్యం కనిపించడంతో మొదలైన టాస్క్‌ రచ్చ రచ్చగా సాగింది. అద్దంలో అరియానాకు దెయ్యం కనిపించడంతో గట్టిగా అరిచింది. కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో అరియానా ను అంతా ఓదార్చి ఎక్కడ దెయ్యి ఉంది. దాన్ని ఇటు రమ్మను అంటూ తెగ హడావుడి చేశారు. సోహెల్‌ మరియు అవినాష్‌ లు చేసిన రచ్చ మామూలుగా లేదు. వారిద్దరు దెయ్యంతో తెగ అల్లరి చేశారు. ఎలా ఉన్నావ్‌ దెయ్యం, నీకు పెళ్లి అయ్యిందా కాకుంటే నేను పెళ్లి చేసుకుంటా అంటూ అవినాష్‌ మాట్లాడటం నవ్వు తెప్పించింది.

రెండు మూడు సార్లు కనిపించడంతో పాటు గజ్జల చప్పుడు, భయంకరమైన కూతలు వినిపించడం వంటివి జరగడంతో ఇంటి సభ్యులు కాస్త భయపడ్డట్లుగా అనిపించినా కూడా పైకి మాత్రం గాంభీర్యంగా ఆ దెయ్యం అయితే ఎవరికి భయం అన్నట్లుగా గబ్బాలు కొట్టారు. హారిక మరియు సోహెల్‌ లు దెయ్యం మ్యూజిక్‌ వచ్చిన ప్రతి సారి కూడా డాన్స్‌ చేయడం మొదలు పెట్టారు. అఖిల్‌ కూడా దెయ్యం అయితే ఎక్కడ అంటూ వారితో కలిశాడు. అయితే అభిజిత్‌ మాత్రం ఎప్పటిలాగే చాలా కామ్‌ గా సైలెంట్‌గా ఉన్నాడు.

ఇక అఖిల్‌ తో మళ్లీ కనెక్షన్‌ కలుపుకునేందుకు మోనాల్‌ ప్రయత్నించింది. కాని అఖిల్‌ మాత్రం నిర్మొహమాటంగా వద్దు అన్నట్లుగా మాట్లాడేశాడు. ఫ్రెండ్‌ గా ఉండేందుకు నో ప్రాబ్లమ్‌ కాని అంతకు మించి మాత్రం తాను ముందుకు వెళ్లాలని అనుకోవడం లేదు అంటూ అఖిల్‌ చెప్పాడు. ఇద్దరి మద్య స్నేహం అయితే బలంగా ఉందని క్లారిటీ ఇచ్చారు. ఇక మోనాల్‌ తో కాస్త దూరం అయినట్లుగా అనిపించిన అఖిల్‌ తాజా ఎపిసోడ్‌ లో అరియానాతో చేరి ఆమెతో పులిహోరా కలిపేందుకు ప్రయత్నించినట్లుగా అనిపించింది. అతడు ఆమెను ఇంప్రెస్‌ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అవినాష్‌ అక్కడకు వచ్చి ఏం జరుగుతుంది అంటూ కుళ్లుకున్నట్లుగా కనిపించాడు.

ఆ సమయంలోనే మోనాల్‌ రావడంతో ఆమెతో అవినాష్‌ పులిహోరా కలిపేందుకు ప్రయత్నించాడు. మొత్తానికి ఇద్దరి అటు ఇటు అయ్యారు. కొద్ది సమయం తర్వాత మళ్లీ దెయ్యం సందడి మొదలు అయ్యింది. టాస్క్‌ లో భాగంగా అభిజిత్‌ మరియు అఖిల్‌ లు ఇప్పటి వరకు మోనాల్‌ను చాలా ఏడిపించారు. అందుకే ఆమెను ఒకరు డేట్‌కు తీసుకు వెళ్లాలి అంటూ టాస్క్‌ వచ్చింది. ఆ సమయంలో నాకు మోనాల్‌ తో ఎలాంటి సంబంధం వద్దు.

మళ్లీ ఈ డేట్‌ ఏంటీ అంటూ అభిజిత్‌ అసహనం వ్యక్తం చేశాడు. అభిజిత్‌ మోనాల్‌ అనే చర్చ బయట నాకు వద్దే వద్దు. అందుకే నేను ఈ టాస్క్‌ లో పాల్గొనను అన్నాడు. దాంతో అఖిల్‌ను మాత్రమే టాస్క్‌ లో పాల్గొనాల్సిందిగా బిగ్‌ బాస్‌ ప్రకటించాడు. ఆ సమయంలో మొదటి సారి అభిజిత్‌ కళ్లలో నీళ్లు వచ్చాయి. సాదారణంగా అభిజిత్‌ చాలా బలంగా కనిపిస్తాడు. కాని నిన్నటి ఎపిసోడ్‌ లో మోనాల్‌ వ్యవహారం వచ్చినందుకు ఎందుకో బాగా అప్‌ సెట్‌ అయినట్లుగా అనిపించింది. తదుపరి ఎపిసోడ్‌ దెయ్యం టాస్క్‌ మరింత క్రిటికల్‌గా మారబోతుంది. మళ్లీ గొడవలతో రచ్చ రచ్చ జరుగబోతుందని ప్రోమో చూస్తే అర్థం అవుతుంది.