అవినాష్ అంటే ఇష్టమే, కానీ అభిజీత్ కే ఓటు: జబర్దస్త్ ఆర్టిస్ట్

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలే వీక్ కు చేరుకుంటోంది. ఇక ఫైనల్స్ కు కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలున్నాయి. ప్రస్తుతం హౌజ్ లో ఏడుగురు ఉన్నారు. వీరిలో ఐదుగురు ఫైనల్స్ కు వెళతారు. ఇక ఫైనల్స్ కు వెళ్లేదెవరో అన్న దానిపై ఇప్పటికే ఒకింత క్లారిటీ వచ్చేసింది జనాలకు.

ఫైనల్స్ కు మాత్రమే కాదు, టైటిల్ విన్నర్ ఎవరనేది కూడా తేలిపోయింది అంటున్నారు. ఈసారి టైటిల్ విన్నర్ అభిజీత్ అనేది చాలా మంది మాట. ప్రస్తుతం అభిజీత్ కు ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. బిగ్ బాస్ విన్నర్ అతనే అంటూ పోల్స్ పెడుతున్నారు.

ఇక నాగబాబు రీసెంట్ గా బిగ్ బాస్ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ ఆర్టిస్ట్ గా అవినాష్ అంటే తనకు ఇష్టమేనని, అయితే ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు అవినాష్ మారిపోతున్నాడని, ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడంలో కచ్చితంగా అభిజీత్ తనకు బెస్ట్ అనిపిస్తున్నాడని, బయట కలిసినప్పుడు కూడా డౌన్ టుఎర్త్ గా మెలిగాడని ప్రశంసలు కురిపించాడు.

సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని జబర్దస్త్ ఆర్టిస్ట్ బులెట్ భాస్కర్ కూడా వెల్లిబుచ్చాడు. జబర్దస్త్ మెంబర్ గా అవినాష్ అంటే తనకు ఇష్టమేనని, కానీ ఎమోషన్స్ ను బాగా కంట్రోల్ చేసుకుంటున్న అభిజీత్ కే తన ఓటు అని నిర్మొహమాటంగా చెప్పేసాడు బులెట్ భాస్కర్.