బిగ్ బాస్4: ఎపిసోడ్84- అభిజిత్‌, హారికలపై సీరియస్‌ అయిన నాగార్జున

బిగ్‌ బాస్‌ శనివారం ఎపిసోడ్‌లో కాస్త సీరియస్‌ నోడ్‌ లో సాగింది. బెస్ట్‌ కెప్టెన్‌గా ఎంపిక అయిన హారికను కన్ఫెషన్‌ రూంకు పిలిచిన నాగార్జున ఆమె చేసిన తప్పుల గురించి చెప్పాడు. అభిజిత్‌ ఇంగ్లీష్‌ లో మాట్లాడుతుంటే ఆపలేదు, అతడు టాస్క్‌ చేయనంటే అతడిని టాస్క్‌ చేసేందుకు ఒప్పించలేదు అయినా నువ్వు ఎలా బెస్ట్‌ కెప్టెన్‌ అయ్యావు అంటూ నాగార్జున డైరెక్ట్‌ అడగడంతో హారిక ఫ్యూజ్‌ ఎగిరి పోయింది. అదే సమయంలో నీకు కెప్టెన్సీలో మోనాల్‌ సాయం చేసింది. కాని ఆమెను నువ్వు ఎలిమినేషన్‌ లోకి నెట్టావు. అది ఎంత వరకు కరెక్ట్‌ అంటూ హారికనుక నాగార్జున ప్రశ్నించాడు. నువ్వు మోనాల్‌ వల్ల కెప్టెన్ అయ్యి, అభిజిత్‌ కోసం కెప్టెన్సీని ఉపయోగించినట్లుగా అనిపించింది అంటూ నాగార్జున అన్నాడు.

ఆ తర్వాత ఇంటి సభ్యులను ఒక్కొక్కరు ఈ వారంలో మీరు చేసిన తప్పులు ఏంటీ చెప్పండి అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో బిగ్‌ బాస్‌ ఇచ్చిన జలజ టాస్క్‌ ను సరిగా చేయలేక పోవడం మేము చేసిన పెద్ద తప్పు అన్నట్లుగా అందరు కూడా ఒప్పుకున్నారు. అవినాష్‌ మాత్రం తాను అరియానా పట్ల కాస్త రూడ్‌ గా ప్రవర్తించాను అది తాను చేసిన మరో తప్పు అన్నాడు. ఇక సోహెల్‌ మోనాల్‌ విషయంలో కాస్త సైక్‌ గా వ్యవహరించాను అది తన మరో తప్పు అన్నట్లుగా ఒప్పుకున్నారు. ఇక అభిజిత్‌ ను తప్పు చెప్పమంటూ అడిగేందుకు ముందు మెయిన్‌ డోర్‌ ను ఓపెన్‌ చేయమని నాగార్జున కాస్త సీన్‌ క్రియేట్‌ చేశాడు. ఆ సమయంలో అభిజిత్‌ చాలా టెన్షన్‌ పడ్డాడు.

టాస్క్‌ చేయక పోవడం తప్పే. కాని ఆ సమయంలో తాను మరోలా ఆలోచించాను అని అన్నాడు. వీడియోలతో సహా చూపించడంతో అభిజిత్‌ ఏమీ మాట్లాడలేక మోకాళ్లపై కూర్చుని క్షమాపణ అడిగాడు. నేను తప్పు చేశాను అంటూ మొదట ఒప్పుకునేందుకు నిరాకరించిన అభిజిత్‌ ఆ తర్వాత నాగార్జున ఒత్తిడి కలిగించే మాటలతో చివరకు బిగ్‌ బాస్‌ కు క్షమాపణ చెప్పడంతో పాటు తాను తప్పు చేసినట్లుగా ఒప్పుకున్నాడు. తప్పు చేసినట్లుగా ఒప్పుకోకుంటే నీవు ఈరోజు వెళ్లి పోయేవాడివి అంటూ అభిజిత్‌ ను ఉద్దేశించి నాగార్జున అన్నాడు.

ఇక ఈ వారం నామినేషన్‌ లో ఉన్న అఖిల్‌, మోనాల్‌, అవినాష్‌ మరియు అరియానాలను టెన్షన్‌ పెడుతూ మొదటగా ఒకరిని సేవ్‌ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. తాజా ఎపిసోడ్‌ లో మోనాల్‌ సేవ్‌ అయ్యింది. దాంతో మరోసారి ఆమె కన్నీరు ఆపుకోలేక బరస్ట్‌ అయ్యింది. ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మొత్తానికి మరోసారి మోనాల్‌ సేవ్‌ అవ్వడం మిస్ట్రీగా మారింది. ఇప్పటికే ఎన్నో వారాలుగా మోనాల్‌ సేవ్‌ అవుతూ వచ్చింది. ఈ వారంలో మొదట్లోనే సేవ్‌ అయ్యింది. ఆదివారం ఎపిసోడ్‌ లో ముగ్గురి విషయం బయటపడనుంది. బిబి నుండి అందుతున్న లీక్‌ ప్రకారం ఈ వారం ఎవరు ఎలిమినేషన్‌ లేదు. అవినాష్‌ ఎలిమినేట్‌ అవ్వగా తన వద్ద ఉన్న పాస్‌ తో సేవ్‌ అయ్యాడు.