సగానికి పడిపోయిన బిబి4 రేటింగ్‌

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 మొదటి వారంలో రికార్డు స్థాయి రేటింగ్‌ నమోదు అయ్యింది. ప్రారంభ ఎపిసోడ్‌ తో పాటు ఆ తర్వాత వారంలోని ఎపిసోడ్‌ లో కూడా బాగానే రేటింగ్‌ను దక్కించుకున్నాయి. 18.5 రేటింగ్‌ తో బిగ్‌బాస్‌ రికార్డ్‌ దక్కించుకున్నట్లుగా స్వయంగా నాగార్జున ప్రకటించాడు. ఇప్పటి వరకు ఏ భాషలో కూడా బిగ్‌బాస్‌ ఈ స్థాయి రేటింగ్‌ పొందలేదు అంటూ నాగ్ మొన్నటి వారాంతాపు ఎపిసోడ్‌ లో పేర్కొన్నాడు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు బిగ్‌ బాస్‌ చూస్తున్నట్లుగా నాగ్‌ ప్రకటించడం జరిగింది. కాని ఆ తర్వాత వారం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

మొదటి వారంలో 18.5 రేటింగ్‌ వచ్చిన బిగ్‌ బాస్‌ కు తదుపరి వీకెండ్‌ ఎపిసోడ్‌ కు 10.7 రేటింగ్‌ పొందినట్లుగా బుల్లి తెర వర్గాల ద్వారా తెలుస్తోంది. వీకెండ్‌ సోలకు ఒక మోస్తరుగా రేటింగ్‌ వచ్చినప్పటికి వీక్ డేస్‌ షోకు మాత్రం కేవలం 8.05 రేటింగ్‌ మాత్రమే వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వారంలో ఉక్కు హృదయం అంటూ కాస్త ఆసక్తికరమైన టాస్క్‌ను బిగ్‌ బాస్‌ ఇచ్చాడు కనుక ఏమైనా రేటింగ్‌ పెరుగుతుందో లేదో వచ్చే వారంతో తెలుస్తుంది.

బిగ్‌ బాస్‌ రేటింగ్‌ విషయంలో సగానికి పడిపోవడానికి ప్రధాన కారణం ఐపీఎల్‌ అంటున్నారు. ఐపీఎల్‌ కారణంగా బిగ్‌ బాస్‌ ను చూసే వారి సంఖ్య తగ్గినట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమైన మ్యాచ్‌ లు ఉన్న సమయంలో బిగ్‌ బాస్‌ ను అస్సలు పట్టించుకోవడం లేదంటున్నారు. పరిస్థి ఇలాగే కొనసాగితే బిగ్‌ బాస్‌ నిర్వాహకులకు కష్టాలు తప్పవని అంటున్నారు.