తెలుగు బిగ్ బాస్ చివరి రెండు వారాలు మిగిలి ఉన్నాయి. ఆదివారం ఎపిసోడ్ లో అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. టాప్ 5 లో ఖచ్చితంగా అవినాష్ ఉంటాడు అంటూ అంతా నమ్మకంగా ఎదురు చూశారు. కాని అవినాష్ ఎక్కువ సార్లు నామినేషన్ లోకి రాకపోవడం వల్ల ఎప్పుడైతే నామినేషన్ లోకి వస్తున్నాడో అప్పుడు అతడు టెన్షన్ పడుతున్నాడు. ఆ టెన్షన్ లో అతడు ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా ఉంది. దాంతో అతడికి ఓట్లు వేసేందుకు పెద్దగా జనాలు ఆసక్తి చూపించినట్లుగా అనిపించలేదు. దానికి తోడు మోనాల్ ను పదే పదే వీక్ అనడం వల్ల కూడా అది ఆయనకు మైనస్ అయ్యిందేమో అనిపించింది.
మోనాల్ వీక్ అయినా కూడా ఒకరి వీక్ నెస్ ను ఎత్తి చూపడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అది అందరికి తెలిసేలా ఇండైరెక్ట్‌గా చేస్తే బాగుండేది. కాని అవినాష్ అలా చేయకుండా మోనాల్ ను డైరెక్ట్‌గా వీక్ అంటూ చెప్పడం తో అతడి ఓవర్ కాన్ఫిడెన్ష్ పై విమర్శలు వచ్చాయి. ఆ కారణంగానే బిగ్ బాస్ నుండి అవినాష్ వెళ్లి పోయాడు అనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ యారోమ్ కి యార్ ఆటతో మొదలు అయ్యింది. ఎవరి మనసు ఎవరికి తెలుసు అనే విషయాన్ని ఈ ఆటలో తెలుసుకునే అవకాశం ఉంది. మోనాల్, హారిక, సోహెల్ లకు మద్య టై అవ్వగా మళ్లీ గేమ్ పెట్టారు. అందులో మోనాల్ వెళ్లి పోగా, ఆ తర్వాత సోహెల్ హారికల మద్య పోటీ జరిగింది. ఆ సమయంలో అరియానా అమ్మగారి ప్రొఫెషన్ ఏంటీ అంటూ ప్రశ్న అడిగిన వెంటనే సోహెల్ చెప్పేశాడు. దాంతో యారోమ్ కి యార్ గా సోహెల్ నిలిచాడు.
ఆ తర్వాత సరదా సరదాగా ఆటను కొనసాగించారు. డాన్స్ లతో ఆకట్టుకున్నారు. ఒక్కరు ఒక్కరు చొప్పున సేవ్ అవుతూ వచ్చారు. చివరకు అవినాష్ మరియు మోనాల్ లు మిగిలారు. ఇద్దరిలో అవినాష్ ఎలిమినేట్ అవ్వడంతో ఇళ్లంత ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. అవినాష్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ స్టేజ్ పైకి వెళ్లాడు. అక్కడ నాగార్జునతో కలిసి ఇంటి సభ్యులందరిని కూడా నవ్వించే ప్రయత్నం చేశాడు. నాగార్జున కోరిక మేరకు ప్రతి ఒక్కరిని కూడా ఇమిటేట్ చేసి అవినాష్ అక్కడ నుండి వెళ్లాడు. ఇక బిగ్ బాంబ్ ఈ వారం అంతా కూడా పని చేయకుండా ఉండాలి. ఆ బాంబ్ ను అభిజిత్ కు ఇచ్చాడు. దాంతో అతడు థ్యాంక్యూ అవి అంటూ కృతజ్ఞతలు చెప్పాడు. అలా ఆదివారం ఎపిసోడ్ పూర్తి అయ్యింది. తదుపరి ఎపిసోడ్ అయిన సోమవారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేషన్ లో ఉండబోతున్నారు అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.