బిగ్ బాస్ ‘అరియానా’పై వర్మ కన్ను..! ఏమన్నాడంటే..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది. ఆయన తీసే సినిమాలు కూడా కాంట్రవర్శీ అవుతూంటాయి. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ ఫేం.. అరియానాపై చేసిన కామెంట్ సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. అరియానాతో సినిమా తీస్తానంటూ ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఆమధ్య వర్మను ఇంటర్వ్యూ చేస్తూ ప్రస్తుతం మీకు ఏ అమ్మాయిని చూస్తే వావ్.. అనిపిస్తుంది అని అడిగితే.. ‘నువ్వే’ అని సమాధానం ఇచ్చాడు. అలా.. అరియానా పాపులర్ అయి.. ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్లింది.

ఇప్పుడీ విషయాన్నే వర్మ ముందు ప్రస్తావనకు రాగా తాను బిగ్ బాస్ చూడనంటూ సమాధానం ఇచ్చాడు. అయితే.. అరియానా ఈ షోలో ఉందని తెలుసుకుని తనతో సినిమా తీస్తానంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. దీనిపై షో అయ్యాక అరియానా ఎలా స్పందిస్తుందో చూడాలి. బిగ్ బాస్ 4వ సీజన్ మరో రెండు వారాల్లో పూర్తవుతోంది. షోలో మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ లో అరియానా ఉంది. టాప్ ఫైవ్ లోకి వెళ్లే దిశగా దూసుకుపోతోంది.