తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 పూర్తి అయినా కూడా ఆ సందడి ఇంకా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది. కంటెస్టెంట్స్ సోషల్ మీడియాలో హడావుడి కొనసాగిస్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు షోల్లో పాల్గొంటున్నారు. తాజాగా అరియానా ఒక చిట్ చాట్ లో తోటి కంటెస్టెంట్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాప్ 4 స్థానంలో నిలిచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అరియానా తాను అనుకున్నది అనుకున్నట్లుగా మాట్లాడటం అందరికి నచ్చుతుంది. అభిజిత్ విషయంలో కూడా అరియానా అదే వ్యాఖ్యలు చేసింది.
హౌస్ లో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా వారి గేమ్ ఆడారు. ఎవరు ఎలా ఆడాలనుకున్నారో అలా ఆడారు. అయితే కొందరి గేమ్ లు మాత్రమే ప్రేక్షకులకు నచ్చుతాయి. అంతిమంగా అభిజిత్ విన్నర్ అయ్యాడు. ప్రేక్షకులకు మాత్రమే కాకుండా అభిజిత్ గేమ్ నాకు కూడా నచ్చింది. అందుకే అభిజిత్ విన్నర్ అవ్వాలని కోరుకున్నాను. అభిజిత్ విన్నింగ్ కు అర్హత ఉన్న వ్యక్తి అంటూ అరియానా కామెంట్ చేసింది. తనను ప్రేక్షకులు ఇంతగా ఆధరిస్తారని ఊహించలేదు అంటూ అరియానా పేర్కొంది. అవినాష్ మంచి స్నేహితుడు మాత్రమే అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చింది.