బిగ్ బాస్ 5 లో నాలుగో వారం కొత్త కెప్టెన్ వచ్చాడు. జెస్సీ కెప్టెన్ గా ఫెయిల్ అవ్వడంతో తనను, తనతో పాటు ఉన్న కాజల్ ను కూడా కెప్టెన్సీ పోటీదారులు అనర్హులని చెప్పిన విషయం తెల్సిందే. ఇక ఈరోజు కూడా గెలవాలంటే తగ్గాల్సిందే టాస్క్ కొనసాగింది. ఈసారి పవర్ హౌజ్ అవకాశం శ్వేత. అన్నీ మాస్టర్ లకు రాగా వారు ప్రత్యర్థులుగా షణ్ముఖ్, సిరిలను ఎంచుకున్నారు. ఈ టాస్క్ లో చాలా సునాయాసంగా శ్వేతా, అన్నీ మాస్టర్ లు గెలుపొందారు. అయితే కాజల్ సంచాలకునిగా సరిగా వ్యవహరించలేదని, షణ్ముఖ్, సిరిల వైపు పక్షపాతం చూపించిందని సన్నీ ఆరోపించాడు.
ఈ టాస్క్ పూర్తయ్యాక మొదటి రౌండ్ పూర్తయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. ఏ టీమ్ ఎక్కువ బరువు తగ్గుతుందో వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కు వెళతారు. మానస్, సన్నీల జంట ఏకంగా 10.4 కిలోల బరువు తగ్గారు. ఇందులో మానస్ ఒక్కడే ఆరు కిలోలు తగ్గడం విశేషం. ఆ తర్వాత శ్రీరామ్ చంద్ర, హమీదలు 8.8 కిలోలు తగ్గారు. ఇక మూడో జంట శ్వేతా, ఆనీ మాస్టర్ లు 4.4 కిలోలు తగ్గారు. టాప్ 3 వచ్చిన ఈ ముగ్గురూ నెక్స్ట్ రౌండ్ కు వెళతారని, వాళ్లలో వాళ్ళే మాట్లాడుకుని టీమ్ నుండి ఒక్కరు నెక్స్ట్ రౌండ్ కు వెళ్లాలని బిగ్ బాస్ అడిగారు. ఫైనల్ కెప్టెన్సీ పోటీదారునిగా శ్రీరామ్ చంద్ర, సన్నీ, శ్వేతాలు నిలబడ్డారు.
ఫైనల్ టాస్క్ లో నిలబడిన ముగ్గురిలో కెప్టెన్సీకు అనర్హులుగా భావించిన వారిని కత్తితో పొడిచి చెప్పాల్సి ఉంది. ఈ టాస్క్ లో సన్నీకు దాదాపు 9 మంది సన్నీకు కత్తితో పొడిచి అనర్హునిగా ప్రకటించారు. ఈ సమయంలో సన్నీకు చాలా మంది కంటెస్టెంట్స్ తో దూరం ఏర్పడింది. ముఖ్యంగా కాజల్, విశ్వ, ప్రియాంక, సిరి వంటి వారితో సన్నీకి చెడిందని క్లియర్ గా అర్ధమైపోయింది. ఎక్కువ మంది తనకే పొడవడంతో సన్నీ ఎమోషనల్ అయ్యాడు.
ఫైనల్ గా శ్రీరామ్ చంద్రను ఆనీ మాస్టర్, జెస్సీలు కత్తితో పొడిచారు. శ్వేతాను ముగ్గురు పొడిచారు. తక్కువ మంది పొడవడంతో ఈ వారం ఇంటి కెప్టెన్ గా శ్రీరామ్ చంద్ర నిలిచాడు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం, కెప్టెన్సీ టాస్క్ పూర్తవ్వగానే తనను చాలా సపోర్ట్ చేసిన మానస్ గురించి శ్వేతా, జెస్సీలతో అసహనంగా మాట్లాడాడు సన్నీ. అది తనకు నెగటివ్ అయ్యే అవకాశముంది.