బిగ్ బాస్ సీజన్ 5 లో 12 వారాలు ముగిసాయి. 12 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇంకా హౌజ్ లో ఏడుగురు ఉన్నారు. షణ్ముఖ్ కెప్టెన్ కాబట్టి ఈసారి నామినేషన్స్ లో తనను నామినేట్ చేయడానికి లేదు. అయితే నామినేషన్స్ కు ముందు ప్రియాంకతో షణ్ముఖ్ మాట్లాడిన మాటలు చాలా ఎఫెక్ట్ చూపించాయనే చెప్పాలి. ఎందుకంటే షణ్ముఖ్, ప్రియాంక వద్దకు వెళ్లి “ఒకవేళ మానస్, కాజల్, సన్నీ, నువ్వు నామినేషన్స్ లో ఉంటే వాళ్ళు ముగ్గురూ ఎవరిని నామినేట్ చేస్తారు? నిన్నే కదా? వాళ్ళ ముగ్గురూ నిన్ను చేస్తారు, కాబట్టి నువ్వు ఎందుకు వాళ్ళను నామినేట్ చేయను అని ఆలోచించాలి” అని మాట్లాడాడు. నామినేషన్ ప్రాసెస్ మొత్తం చూస్తే ప్రియాంక మైండ్ లో ఇదే ప్లే అయిందేమో అనిపించింది.
నామినేషన్స్ ప్రాసెస్ లో భాగంగా మెయిన్ గేట్ ఓపెన్ చేసారు. నామినేట్ చేయాలనుకున్న వ్యక్తి ముందు ఉన్న బాల్ ను exit కు తన్ని నామినేట్ చేయాల్సి ఉంది. ముందుగా కెప్టెన్ అయిన షణ్ముఖ్ – కమ్యూనిటీ అన్న పదం వాడినందుకు కాజల్ ను, నెగటివ్ పాయింట్స్ సరిగ్గా తీసుకోలేనందుకు ప్రియాంకను నామినేట్ చేసారు. తర్వాత వచ్చిన ప్రియాంక చాలా సేపు ఎవరినీ నామినేట్ చేయలేనని చెప్పింది. అయితే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇన్ని వారాలు గడిచాక ఇప్పుడు నామినేషన్ ఇంపార్టెన్స్ గురించి చెప్పాలా అని అన్నాడు. ప్రియాంక తన కమ్యూనిటీ గురించి తెచ్చినందుకు కాజల్ ను నామినేట్ చేసింది. ఒక సిల్లీ రీజన్ తెచ్చి సిరిని నామినేట్ చేసింది.
శ్రీరామ్ చంద్ర నామినేట్ చేస్తున్నప్పుడు మానస్ కు తనకు మధ్య మాటల గొడవ జరిగింది. మానస్ తో పాటు కాజల్ ను కూడా నామినేట్ చేసాడు. సిరి సేమ్ కమ్యూనిటీ టాపిక్ తెచ్చి కాజల్ ను నామినేట్ చేసింది. తనను సిల్లీ రీజన్ తో నామినేట్ చేసినందుకు ప్రియాంకను కూడా నామినేట్ చేసింది. సన్నీ తనకు వేరే ఆప్షన్స్ లేవు కాబట్టి సిరి, శ్రీరామ్ ను నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. మళ్ళీ మానస్ వచ్చి శ్రీరామ్ ను నామినేట్ చేసాడు. మళ్ళీ మానస్, శ్రీరామ్ ల మధ్య మాటల యుద్ధం నడిచింది. సిరిను కూడా నామినేట్ చేసాడు. ఇక లాస్ట్ గా వచ్చిన కాజల్, నీకోసం స్టాండ్ తీసుకుంటే నన్నే నామినేట్ చేసావు, నా మీద నాకే జాలి వేస్తోంది అని చెప్పి ప్రియాంకను, సిరిని నామినేట్ చేసింది.
మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లో షణ్ముఖ్, సన్నీ తప్ప కాజల్, ప్రియాంక, శ్రీరామ్, మానస్, సిరి లు నామినేషన్స్ లో నిలిచారు.