షన్నూ లూజర్ అని దీప్తికి తెలిసి పోయిందా?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విజేత ఎవరు అనేది అధికారికంగా మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది. అయితే అనధికారికంగా ఇప్పటికే సన్నీ అనే క్లారిటీ వచ్చేసింది. షన్నూ మరియు సన్నీకి వచ్చిన ఓట్ల మద్య తేడా చాలా ఎక్కువగా ఉంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే హౌస్ నుండి సిరి మరియు మానస్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారికి సంబంధించిన ఎలిమినేషన్ పక్రియ షూటింగ్ నేడు జరుగాల్సి ఉంది. అందుకు సంబంధించిన షూట్ కూడా జరిగి ఉంటుంది. టాప్ 3 లో ఉన్న శ్రీరామ్ మొదటగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన ఇద్దరిలో సన్నీని విజేతగా ప్రకటిస్తారని అంతా అంటున్నారు.

ఇలాంటి సమయంలో షన్నూ ప్రియురాలు.. కాబోయే భార్యగా ప్రచారం జరుగుతున్న ఆయన స్నేహితురాలు దీప్తి సునైన సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో ఆమె అప్పుడే ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన వారికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ పెట్టింది. జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక కారణంతో.. కారణం కొరకు జరుగుతుంది. షన్నూ కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అంటూ పోస్ట్ పెట్టింది. ఎపిసోడ్ టెలికాస్ట్ కాకుండానే ఆమెకు సన్నీ విజేత అనే విషయం తెలిసి పోయిందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. షన్నూ కోసం ఇంకా ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్న ఈ సమయంలో దీప్తి సునైనా స్వయంగా ఇలాంటి ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉంది.

బిగ్ బాస్ కు సంబంధించినంత వరకు దీప్తి సునైన మరియు షన్నూల జోడీకి లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఆమె గతంలో హౌస్ లోకి వెళ్లిన సమయంలో భారీ ఎత్తున ఓట్లు పడ్డాయి. ఇప్పుడు షన్నుకు కూడా భారీగానే ఓట్లు పడ్డాయి. కాని షన్నూ మరియు సిరిల విషయంలో బెడిసి కొట్టింది. వారు ఏదో వ్యూహం ప్రకారం హౌస్ లో అడుగు పెట్టారని.. వారు కావాలని డ్రామా ఆడుతూ అలా హగ్ లు ముద్దులు పెట్టుకుంటున్నారనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. వేటి వల్ల అయితే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలని భావించారో వాటి వల్లే షన్నూ ట్రోఫీ నుండి దూరం జరగాల్సి వచ్చింది అనేది కొందరి అనుమానం. మొత్తానికి బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది అధికారికంగా రాత్రి 10 గంటల వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.