ఏపీ మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నాయకుడు బొండా ఉమ తనపై కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారంపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక హోటల్ నుండి బొండా ఉమ హీరోయిన్ తో బయటకు వస్తున్నట్లుగా సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. తన పరువు తీసే విధంగా వస్తున్న కథనాలపై బొండా ఉమ అసహనం వ్యక్తం చేశాడు. హీరోయిన్ తో బొండా ఉమ బయటకు వస్తున్న వీడయోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన వెంటనే స్పందించాడు.
ఆ హీరోయిన్ ఎవరో కూడా తనకు తెలియదు అని.. కొందరు కావాలని తనపై కక్ష కట్టి మరీ ఈ ప్రచారం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ బొండ ఉమా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో ఫిర్యాదు కాపీని షేర్ చేసిన ఆయన పేటీఎం బ్యాచ్ జఫ్పాల్లారా అంటూ తనపై ఆరోపణలు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
దమ్మున్నోడిగా ఫిర్యాదు చేశాను. మీ నాయకుడు జైలుకు వెళ్లినట్లుగా మీరు కూడా జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉండండి అంటూ హెచ్చరించాడు. మేనేజ్ చేయడానికి వీళ్లు ఏమీ ఏపీ పోలీసులు కాదు అంటూ కూడా బొండ ఉమా ట్వీట్ చేశాడు.