ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుండి కూడా పవన్ కళ్యాణ్ చొక్కాలు చించుతూ ప్రత్యర్థి పార్టీలను పరుగులు పెట్టిస్తాను అంటున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు పవన్ ఏం చేశాడో.. ఏం సాధించాడో చెప్పాలని, ఆయన మాటలు చేష్టలకు పొంతన ఉండదు అంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నాడు. ఆయన గురించి ఏపీ రాజకీయాల్లో ఎలాంటి చర్చ అవసరం లేదు అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రజారాజ్యం పెట్టినప్పటిన ఉండి ఆయన మాటలు వింటున్నాం కాని చేష్టలు ఏవీ అంటూ ప్రశ్నించాడు.
రాష్ట్రంలో ఆయన అవసరం లేదు అన్నట్లుగా బొత్స పేర్కొన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 3097 చెత్త సేకరించే ఆటోలను జగన్ విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ప్రారంభించడం జరిగిందని.. ఆ వాహనాలతో రాష్ట్రం క్లీన్ గా మారుతుందని.. జగనన్న క్లీస్ ఏపీ అన్నట్లుగా మార్చబోతున్నట్లుగా పేర్కొన్నారు. 38 వేల మంది శానిటరీ శ్రామికులను ఎంపిక చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చి శ్రమదానం మరేదానం అన్నా కూడా జనాలు పట్టించుకోరు అంటూ బొత్స చెప్పుకొచ్చాడు.