బోయపాటి రాపో.. పాన్ ఇండియా టార్గెట్

మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్లతో సత్తా చాటుతున్న డైరెక్టర్ బోయపాటి కూడా పాన్ ఇండియా రేసులోకి చేరుతున్నారు. బోయపాటి తెరకెక్కించే తదుపరి చిత్రం పాన్ ఇండియా అంటూ గుసగుస వినిపిస్తోంది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఇప్పటికే స్క్రిప్టు పనులు సాగుతున్నాయి. ఈ సినిమా కథాంశం ఎలా ఉంటుంది? అంటే బోయపాటి మార్క్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ సెంటిమెంట్ తో అలరిస్తుందట. భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తారని తెలిసింది. అయితే పాన్ ఇండియా కాన్సెప్ట్ ని ఎంపిక చేసుకునేందుకు కసరత్తు సాగుతోందని సమాచారం.

నేడు బోయపాటి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సందర్భంగా బోయపాటి రాపో! అంటూ అధికారిక ప్రకటన వెలువడింది.

శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఐదు భాషల్లో నిర్మిస్తారు. తెలుగు-తమిళం-హిందీ – మలయాళం – కన్నడలో రిలీజ్ చేయడమే ధ్యేయంగా ఈ మూవీ రూపొందుతోంది.

రామ్ పోతినేని (రాపో) ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. తెలుగు-తమిళం-హిందీ సహా ఇతర భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ మరో బ్లాక్ బస్టర్ కోసం వేచి చూస్తుండగా బ్లాక్ బస్టర్ల బోయపాటితో మూవీ ఆఫర్ అంటే ఆషామాషీ కాదు.

అఖండ లాంటి సంచలన విజయం తర్వాత బోయపాటి స్కెచ్ హై రేంజులో ఉంది. ఎనర్జిటిక్ రామ్ తో అతడి కాంబినేషన్ ఏ రేంజులో వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.