బడ్జెట్‌లో రాజధానికి దక్కిన నిధులు ఎన్ని?

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పై తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కీలకమైన శాఖలకు సంబంధించిన కేటాయింపుల్లో భారీగా కోత విధించారంటూ విమర్శించారు. ముఖ్యంగా రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు కావాల్సిన మొత్తంలో కనీసం 30 శాతం కూడా విడుదల చేయడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టిన కంపెనీలకు వెయ్యి కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. కాని వాటిని బడ్జెట్‌ లో మంజూరు చేయలేదు.

అమరావతిలో నిర్మాణం అవుతున్న పలు నిర్మాణాలను ఇప్పటికే నిలిపి వేసిన ప్రభుత్వం ఈ బడ్జెట్‌ లో ఏపీ సీఆర్డీయేకు కేవలం రూ.564 కోట్ల ను మాత్రమే కేటాయించడం జరిగింది. అమరావతి మెట్రో కు కూడా నిధుల విషయంలో అస్సలు ప్రభుత్వం ఆసక్తి చూపించినట్లుగా కనిపించలేదు. అయితే నూతన రాజధాని నిర్మాణం కోసం మాత్రం 500 కోట్లను ఖర్చు చేస్తుంది. భూ సేకరణ కోసం ఈ మొత్తంను ఖర్చు చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. దీనిపై అమరావతి ప్రజలు మరోసారి భగ్గుమంటున్నారు.