చంద్రబాబు పేరు చేర్చాల్సిందే.. ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ప్రతి అంశంపై ఎవరొకరు హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో తన పేరు లేదంటూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు స్పందించింది.

స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో చంద్రబాబు పేరు నమోదు చేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల వ్యవధిలో దీనిపై జీవో కూడా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్ఎస్సీలో ప్రతిపక్ష నేత పేరు లేకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.