టాలెంటెడ్ దర్శకుడు.. మరో యాక్షన్ అడ్వెంచర్ తో రెడీ

టాలెంటెడ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఎప్పుడూ తన సినిమాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. అయితే యేలేటి సినిమాలు టైమ్ కు ఎహెడ్ గా ఉంటాయన్న పేరుంది. అందుకేనేమో కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే చాలా గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు ఈసారి కచ్చితంగా హిట్ కొడతాడన్న నమ్మకంతో ఉన్నాడు.

నితిన్ హీరోగా చెక్ సినిమాను రూపొందించాడు ఈ దర్శకుడు. ఈ నెల 26న ఈ సినిమా విడుదల కానుంది. చెక్ సినిమా ఫలితంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు చంద్రశేఖర్ యేలేటి. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెబుతున్నాడు.

అలాగే సాహసం వంటి యాక్షన్ అడ్వెంచర్ ను తెరకెక్కించిన యేలేటి, మరో అడ్వెంచర్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. అలాగే తన వద్ద ఒక ప్రేమ కథ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. చెక్ సినిమా రిలీజ్ పై తన నెక్స్ట్ సినిమా విషయంలో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించాడు.