తండ్రికి, కూతురికి సంబంధం అంటకట్టి తల్లి వేధిస్తోంది: చిన్మయి

చిన్మయి శ్రీపాద అంటే పాపులర్ వాయిస్ ఆర్టిస్ట్. ఎక్కువగా సమంతకు డబ్బింగ్ చెప్పి పాపులర్ అయిన చిన్మయి తెలుగులో కళ్యాణి, త్రిష వంటి హీరోయిన్లకు కూడా డబ్బింగ్ చెప్పింది. సౌత్ లో మీటూ ఉద్యమం ఊపందుకున్న సమయంలో చిన్మయి పెద్ద పోరాటమే చేసింది. వైరముత్తు, రాధా రవి వంటి ప్రముఖుల పేర్లను బయటకు ఈడ్చింది.

ఇదిలా ఉంటే చాలా మంది అమ్మాయిలు, మహిళలు తమకు ఎదురవుతోన్న ఇబ్బందుల గురించి చిన్మయికి సోషల్ మీడియా ద్వారా మొరపెట్టుకుంటున్నారు. అందులో కొన్నిటిని చిన్మయి బయటపెడుతోంది. రీసెంట్ గా ఒకమ్మాయి తన తల్లి తనను వేధిస్తోందని, తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకున్నావని బాధిస్తోందని చిన్మయికి చెప్పింది. దీనిపై చిన్మయి స్పందించింది.

“ఇలాంటి విషయాలపై స్పందించాలి. ఇలాంటివి చూస్తుంటేనే అమ్మాయిలకు తన బాడీ అంటేనే చిరాకు వస్తోంది. రిలేషన్స్ అంటేనే వెగటు అనిపిస్తోంది. మనల్ని కనిపెంచినంత మాత్రాన వాళ్ళు ఏం చేసినా భరించాల్సిన అవసరం లేదు. ఆర్ధిక స్వతంత్రం వచ్చాక బయటకు వచ్చేయడమే మంచిది. అయితే దురదృష్టవశాత్తూ మన దేశంలో ఆ అవకాశం లేదు” అని చిన్మయి వాపోయింది.