మెగాస్టార్ చిరంజీవి 152 చిత్రం ఆచార్య కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు కొరటాల శివ తెరకెక్కించిన ప్రతి ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మిర్చి, శ్రీమంతుడు, జనతగ్యారేజ్, భరత్ అనే నేను ఈ నాలుగు సినిమాలు కూడా వేటికి అవే అన్నట్లుగా నిలిచాయి. ఆ నాలుగు సినిమాలు కూడా మ్యూజికల్‌గా మంచి హిట్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. కొరటాల, దేవిశ్రీల మద్య మంచి అవగాహణ ఉండటంతో మంచి పాటలు వచ్చాయి.
కొరటాల శివ ప్రస్తుతం చేస్తున్న ఆచార్య చిత్రంకు మాత్రం మణిశర్మను సంగీత దర్శకుడిగా ఎంపిక చేయడం జరిగింది. ఈ చిత్రంకు మణిశర్మను సంగీత దర్శకుడిగా ఎంపిక చేయడంకు కారణం చిరంజీవి అంటున్నారు. ఏరి కోరి మరీ మణిశర్మను చిరు ఎంపిక చేశాడంటున్నారు. కొరటాల మాత్రం ఈసారి కూడా దేవిశ్రీ ప్రసాద్‌తో వెళ్లాలనుకున్నా కూడా చిరంజీవి మాట తీయలేక మణిశర్మతో వర్క్ చేస్తున్నాడు.
గత ఆరు నెలలుగా ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారు. కాని ఇప్పటి వరకు మూడు పాటలు కూడా ఫైనల్ కాలేదట. మణిశర్మ ఎన్ని ట్యూన్స్ చేసినా కూడా కొరటాల నచ్చడం లేదట. కొత్తదనంను కోరుతున్న కొరటాలకు మణిశర్మ ఇస్తున్న ట్యూన్స్ నచ్చడం లేదట. దాంతో ఇద్దరి మద్య విభేదాలు కూడా వస్తున్నట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.
రెండు పాటలు మణిశర్మతో చేయించి మిగిలిన పాటలకు దేవిశ్రీ ప్రసాద్‌తో ట్యూన్స్ చేయించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను మణిశర్మతో చేయించాలని కొరటాల భావిస్తున్నాడట. మరి ఈ విషయంలో చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతాడనేది చూడాలి.