డాక్టర్‌ బాబుకు మెగాస్టార్‌ తల్లి ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటో తెలుసా?

`
తెలుగు బుల్లి తెరపై ఇప్పటి వరకు ఎన్నో వందల సీరియల్స్‌ వచ్చాయి. కాని కార్తీక దీపం సీరియల్‌కు వచ్చినంత ప్రజాధరణ ఏ సీరియల్‌కు రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తీక దీపం సీరియల్‌ లో దీప మరియు కార్తీక్‌ల పాత్రలు తెలుగు వారికి బాగా కనెక్ట్‌ అయ్యాయి. ముఖ్యంగా డాక్టర్‌ బాబు పాత్రను తెలుగు వారు ఎంతగా ఓన్‌ చేసుకున్నారో ఆయనకు వచ్చిన ప్రశంసలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

డాక్టర్‌ బాబుగా ఫేమస్‌ అయిన నిరుపమ్‌ ను స్వయంగా మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనా దేవి గారు పిలిపించుకుని మరీ నిరుపమ్‌ ను అభినందించి బహుమానంగా ఒక మామిడి పండ్ల బుట్టను ఇచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా నిరుపమ్‌ చెప్పాడు. తన జీవితంలో అతి గొప్ప బహుమానంగా తాను దాన్ని భావిస్తాను అన్నాడు. తాను అభిమానించే మెగాస్టార్‌ గారి తల్లి నన్ను అభిమానించడం జీవితంలో మర్చి పోలేని గొప్ప అనుభూతిగా నిరుపమ్‌ పేర్కొన్నాడు.

కార్తీక దీపం సీరియల్‌ లో డాక్టర్‌బాబు పాత్రకు జీవం పోసి ప్రతి ఒక్కరితో శహబాష్‌ అనిపించుకున్న నిరుపమ్‌ ఇంకా పలు సీరియల్స్‌ చేస్తున్నా కూడా ఈ సీరియల్‌ తోనే మంచి పేరు దక్కించుకున్నాడు. నిరుపమ్‌ అంటే కంటే డాక్టర్‌ బాబు అంటేనే ఎక్కువ మంది ఈయన్ను గుర్తు పడుతున్నారట. ఈ విషయంను కూడా స్వయంగా నిరుపమ్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.